
MAK NEWS
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఒగ్గు నర్సయ్య ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను పలువురు సర్పంచులు కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఇల్లంతకుంట నుండి వెంకట్రావు పల్లె ప్రధాన రహదారిలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ లో మినరల్ వాటర్ ప్లాంట్ ను వారి ప్రారంభించారు. వినియోగదారులు, ప్రజలు ఈ ఆర్వో ప్లాంటును ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకట్రావ్ పల్లి సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, జంగారెడ్డి పల్లె సర్పంచ్ సునీత తిరుపతి, గొల్లపల్లి సర్పంచ్ రడం లక్ష్మీ ప్రవీణ్, ఉపసర్పంచ్ లక్ష్మన్, పాటుగా నాయకులు పత్రి అంజయ్య ,మేక శ్రీనివాస్ శంకర్ తో పాటుగా ఒగ్గు శివ ఉన్నారు.