
MAKNEWS విధ్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని, ఎవరైన అసాంఘీఖ కార్యకలపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వర్ రావు అన్నారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు భాగంగా విద్యార్థులతో కలిసి “ఓపెన్ హౌస్” నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ విధి విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ రక్షణలో భాగంగా తుపాకీలు, మందు గుండు సామాగ్రి పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండి ,తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలన్నారు. ఈవ్ టిజీంగ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఎం ఉపేంద్ర చారి, ఏఎస్ఐ ఫసియుద్దిన్, హెడ్ కానిస్టేబుల్ లత, కానిస్టేబుల్, తదితరులు పాల్గొన్నారు.