-DTF ఇల్లంతకుంట మండల శాఖ డిమాండ్.
ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని వివిధ పాఠశాలల్లో డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది . దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు, శ్రీహరి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ లోపాలను సరిదిద్దాలని మరియు ఉపాధ్యాయుల ప్రమోషన్ తో పాటు బదిలీలు వెంటనే చేపట్టాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, పి ఆర్ సి, పెండింగ్ బిల్లులు మరియు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల డిటిఎఫ్ అధ్యక్షులు తూముకుంట నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సుద్దాల రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ రామేశ్వర్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు హరిప్రసాద్, స్వామిరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.