రాజ్యాంగం పై సవాళ్లు, దృక్పథాలు, పరిష్కారాలు అనే అంశంపై ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రేపు (ఆగస్టు 2) జరుగనున్న జాతీయ సదస్సులో రాజన్న సిరిసిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ మరియు ఇల్లంతకుంట మండల యువ న్యాయవాది కడగండ్ల తిరుపతి పాల్గొనబోతున్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు.దేశంలోని 29 రాష్ట్రాల నుంచి లీగల్ సెల్ న్యాయవాదులు ఈ సదస్సులో భాగస్వాములవుతారు.ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా చైర్మన్ ఇరుకుళ్ళ అశ్విన్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజి ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులకు కడగండ్ల తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు