✍️Ⓜ️🅰️K NEWS:
ఇల్లంతకుంట మండల కేెంద్రానికి చెందిన సాంఘీఖ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిల క్షేత్ర పర్యటన లో భాగంగా “పొలంబాట” పట్టారు.
గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చూట్టడం జరిగిందన్నారు. “ఈట్ రైట్” అనే కార్యక్రమాన్ని పిల్లలకు పోషకాహారం, గురించి అవగాహన కల్పించడానికి మరియు ,దాని వలన చేకూరే ప్రయోజనాలను వివరించడానికి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇల్లంతకుంట గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థినులను పొలాలకు తీసుకుని వెళ్లి క్షేత్ర పర్యటన చేయించడం జరిగిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలకు వారు తినే ఆహారం ఎలా ఉత్పత్తి చేయబడుతుంది, మరియు అది తమ వరకు చేరే దశలో ఎన్ని మార్పులు చెందుతాయే, అనేది తెలియచెప్పడం కోసం , విద్యార్థులను తీసుకెళ్లడం జరిగిందన్నారు. రైతులకు విద్యార్థినిలు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.