
✍️Ⓜ️🅰️K NEWS
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో అక్రమ మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ అర్భన్ మండలం లోని సతరాజ్ పల్లి గ్రామంలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న మట్టి ట్రాక్టర్లను వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధా బాయి సీజ్ చేయడానికి కలెక్టర్ అభినందించారు.ఇందిరమ్మ ఇండ్లకు పని దినాలలో ప్రభుత్వం ఇసుక, మట్టి తరలించేందుకు అనుమతులు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.అక్రమ మట్టి రవాణా జరుగుతుందని సమాచారంతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించగా 4 ట్రాక్టర్లు, జేసిబి లు పారి పోయాయని వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధా బాయి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ తో అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్ ను ఆర్డిఓ సీజ్ చేశారు.జిల్లాలో ఎవరు అక్రమ ఇసుక మట్టి రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ సందర్భంగా హెచ్చరించారు.