
✍️Ⓜ️🅰️K NEWS
వరుసగా రోజువారిగా కురుస్తున్న వర్షపు దాటికి ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బెజ్జంకి బాబు ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ “బొల్లవేణి మంజుల రమేష్” కూలిపోయిన ఇంటి యజమాని బాబు దగ్గరికి వెళ్లి ఓదార్చారు. ఈ సంఘటనపై స్థానిక పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన బాబుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ తో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఐదు వేల రూపాయల(5000) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, దమ్మని లక్ష్మణ్ ,బోయిన రమేష్ ,బెజ్జంకి రమేష్ ,బెజ్జంకి తిరుపతి, దమ్మని బాబు, బెజ్జంకి చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.