
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొల్లు శేఖర్ తల్లి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇల్లంతకుంట మండల మాజీ ఎంపీపీ ఉట్కూరు వెంకట రమణారెడ్డి, సొల్లు శేఖర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మామిడి సంజీవ్, అమరేందర్ రెడ్డి ,ఎలుక రామస్వామి ,చిట్టి ప్రదీప్ రెడ్డి, ఎండి ఉస్మాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.