
బీజేపి మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్
ఇల్లంతకుంట మండలంలో పేరుకపోయిన పలుసమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపి మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ అన్నారు. తహాసీల్దార్ కు మండలంలోని పలు సమస్యలపై, పరిష్కారానికి వెంటనే చర్యలు, తీసుకోవాలని బీజేపి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసంధర్భంగా అనిల్ మాట్లాడుతూ మండలంలోని ప్రజా సమస్యలు తక్షణమే స్పందించాలని పెద్ద లింగాపూర్ శివారులో 11/6 కెనాల్ పనులు పూర్తి చేయాలని, మండలంలో కృత్రిమ యూరియా కొరతను నివారించడానికి చర్యలు తీసుకోవాలని ,అర్హులు అయిన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని,మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న బస్టాండ్ ఆవరణంలో మల విసర్జన కొరకు మరుగుదొడ్లు నిర్మించాలని, గ్రామాల్లో మట్టి రోడ్డు లు వర్షాలకు గుంతల మయమైన వాటిని, గుంతలు పూడ్చి సరి చేయాలని కోరారు. గ్రామాల్లో దోమల బెడద మరియు విష జ్వరాలపై చర్యలు చేపట్టాలని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంపూర్తిగా చేయాలని, మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, జిల్లా నాయకులు డిసిట్టి శ్రీనివాస్, కొలనూరు ముత్తక్క, రోండ్ల మధుసూదన్ రెడ్డి, మామిడి హరీష్, అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి, మాజీ మండల్ అధ్యక్షులు నాగసముద్రల సంతోష్ గారు, మండల నాయకులు చిమ్మరగొట్టు శ్రీనివాస్, లంకుంజు చంద్రం, గైని శ్రీనివాస్ గౌడ్, పినికాసి అనిల్, బూత్ అధ్యక్షులు తుమ్మనపల్లి కమలాకర్ రావు, పిల్లి వేణుగోపాల్, గుంటి వేణు, కూనబోయిన బాలరాజు, కుడుముల శ్రీహరి, నాయకులు కూనవేణి కార్తీక్, జక్కుల రమేష్, బరిగే దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.