
మహిళసాధికారత మండల కోఆర్డీనేటర్ బోనాల రోజా
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా సిఎం ఆదేశాలతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా విద్యను అందింవ్వాలని కార్యక్రమం చేపట్టారని, దీనిలో భాగంగా స్వయంగా ఆన్ లైన్ ద్వారా ఐఐటి నీట్ ఫౌండేషన్ తరగతులను పరిశీలించినట్లు మహిళసాధికారత కోఆర్డినేటర్ బోనాల రోజ పరిశీలించారు.ఈవిషమమై జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ,ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తున్నారన్నారు.
ఇల్లంతకుంట మండలంలోని మాడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ విద్యాలయం, మరియు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నమన్నారు. ఆన్ లైన్ క్లాసులు వినడంలో పిల్లలకు ఎదురవుతున్న ఇబ్బందులు, స్వసంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గానిర్వహించడానికి, ఇంటర్నెట్ సదుపాయాన్ని మరింత విస్తరించి, టెక్నాలజీ మెలుకువలు పిల్లలకు అందుబాటులో తీసుకొని రావడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు పర్యవేక్షణతో విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని ప్రిన్సిపాల్ ల కు సూచించినట్లు తెలిపారు. పిల్లలతో ముచ్చటంచి బాడ్ టచ్ గుడ్ టచ్ గురించి, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కోన్నారు. క్రమశిక్షణతో చదువుకొని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.