
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం రంగపేట గ్రామంలో 17 ఏళ్ల బాలిక మృతి సంచలనం రేపుతుంది. అనారోగ్యంతో ఇల్లంతకుంట ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు తెలపడంతో సిరిసిల్లకు తరలించారు . అక్కడ వైద్యం చేస్తున్న తరుణంలో బాలిక మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ కూతురు మరణానికి ఓ యువకుడు కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటనతో పోలీసులు వెంటనే ధర్యాప్తు చేపట్టారు. సుమారు గా మూడు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైనట్టుగా తెలిసింది. ఆ బాలికను మండలానికి చెందిన యువకుడు అసభ్యంగా, అశ్లీల వీడియోలు తీసి నట్టుగా, సమాచారం. ఈసంఘటనపై ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.