
✍️Ⓜ️🅰️K NEWS
మట్టి గణపతి లను పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాలను బస్టాండ్ ప్రాంతంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలను వినియోగించడం శ్రేయస్కరం కాదన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువులోని నీటిని తాగడం వల్ల పశుపక్షాదులు అనారోగ్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, రాజు, రమేష్, తిరుపతి, రాజు, శోభ, కళ్యాణి, సునంద, మహాలక్ష్మి, రేణుక, సునీత, రేఖ, లావణ్య, సుమంగళి, జలజ, మౌనిక, రేణుక, శాంత, పద్మ, స్వాతి, షమీమాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు