
శ్రీదామోదర అన్నదాన సత్రంలో అన్నప్రసాదం వితరణ
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయక నవరత్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ,మొదటగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “శ్రీ దామోదర అన్నదాన సత్రంలో” అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలయ అర్చకులు మూగునాగరాజుశర్మ, నాగలింగంపతులు,నర్సయ్య పంతులు తదితరులు పాల్గొన్నారు.