
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలోని MPPS పాఠశాలలో ఉపాధ్యాలను నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు బత్తిని కావ్య మాట్లాడుతూ MPPS(ప్రభుత్వపాఠశాల) కంది కట్కూర్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులం మేము..మా పాఠశాలలో ఇప్పటివరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇందులో ఒకరు ఇటివలే బదిలీ అయి వెళ్ళినారు. ప్రధానోపాధ్యాయులు ఈ నెలలో రిటైర్మెంట్ (పదవి విరమణ) కు సిద్ధంగా ఉన్నారు. “85 మంది” విద్యార్థులు ఉన్న మా పాఠశాలలో ఒకరు మాత్రమే ఉపాధ్యాయులు గా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ సార్ మా యందు దయతలచి.. మా విద్యార్థుల భవిష్యత్తు.. దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, విద్యార్థుల తల్లిదండ్రులు 50 మందితో పాటుగా,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు బత్తిని కావ్య, సభ్యులు గుగ్గిళ్ళ రవలి,నక్క కాంతవ్వ, తంగళ్ళపల్లి గౌతమి, నార్ల పద్మ, బత్తుల రమ, పైడి నిర్మల,రాచకొండ అన్నపూర్ణ, అంగూరు సదాలక్ష్మి, జక్కుల లత, టేకు రేణుక, కంకణాల లాస్య , ఉరడి రజిత , గౌరవేణి జ్యోతి, హరిత, దేవరకొండ సత్యలక్ష్మి,కామారం సదాలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు భూమల్ల అనిల్ కుమార్,ముత్యం శ్రీనివాస్, సింగరవేణి వెంకటేశం, బిగుళ్ల అశోక్ , తాళ్లపల్లి కిషన్, గొట్టం శ్రీకాంత్ ,నక్క పరశురాం, నక్క మోహన్, బిగుళ్ల రాజ్ కుమార్, బొజ్జ పరుశురాం గుగ్గిళ్ళ శ్రీకాంత్ ,దయ్యాల శ్రీకాంత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.