
డబల్ బెడ్ రూమ్ పంపిణీలో ప్రభుత్వ విఫలం
ఎమ్మార్పీఎస్ నాయకులు సావనపల్లి రాకేష్
డబల్ బెడ్ రూమ్ పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఎమ్మార్పీఎస్ నాయకుడు సావనపల్లి రాకేష్ ఆరోపించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట గ్రామం లో గత ప్రభుత్వ హయాంలో 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి 4 సంవత్సరాలు గడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించి పంపిణి చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో మండల అధికారులు గ్రామ అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలందరి సమక్షంలో 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు, అద్దె ఇంట్లో నివసిస్తూ నిరుపేద కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు,వెంటనే దసరా కానుకగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణి చేసి లబ్ధిదారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మండల యువజన సంఘాల jAC అధ్యక్షులు మామిడి విజయ్, బహుజన ఉద్యమ కారులు ఏనుగుల లింగన్న ,దాసరి రవి, తదితరులు పాల్గొన్నారు