
సిద్ధం వేణు
మాజీ వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు ముఖ్యంగా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ అని, ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక ప్రాంతం తెలంగాణ అని అలాంటి పండగ కోసం గ్రామాలలో కనీసం ఏర్పాట్లు చేయకపోవడం సిగ్గుచేటు అని, ఇది మహిళ లోకాన్ని అవమానించడమే అని అన్నారు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు అన్నారు. గ్రామాలలో కనీసం విద్యుత్ దీపాలు వెలగడం లేదు.గ్రామాలను శుభ్రపరిచే పరిస్థితి లేదు,ప్రభుత్వం బతుకమ్మ పండగను పట్టించుకోక పోవడం వల్ల పండగ పూట పల్లెలు కళ తప్పిపోయినాయి అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో లక్షల్లో అప్పులు చేసి పెండింగ్ బిల్లులకోసం ఎదురు చూస్తున్నారు.గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్,పారిశుధ్య కార్మికులకు 3నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా సద్దుల బతుకమ్మ పండగలోపు పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని BRS పార్టీ తరుపున హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సావనపల్లి వనజ -అనిల్ కుమార్,మీసరగoడ్ల అనిల్ కుమార్,BRS ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు, పెద్దలింగపూర్ మాజీ ఉపసర్పంచ్ కుమార్, భాగయ్య, కేశవేణి శ్రీనివాస్, బర్ల రమేష్, గుంటి మధు తదితరులు పాల్గొన్నారు.