
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అగ్రభాగంలో ఉన్నా కూడా రాజ్యాధికారం సాధించడంలో విఫలమైతున్నారని తెలంగాణ ప్రముఖ వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడు అంబర్పేట్ శంకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెజార్టీ శాతం బీసీలు ఉన్నా కూడా రాజ్యాధికార సాధనలో బీసీలు అధికారం చేపట్ట లేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలు అందరు కూడా ఐక్యంగా పోరాడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని కనీసం చేసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటి, ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రతి ఒక్కరికి సూచించారు. ఈరోజు ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు నన్ను పిలవడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి ఆయన కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు తో పాటుగా పండుగ సాయన్న గారు ఎంతగానో మన కోసం కృషి చేశారని వారి ఆశయ సాధన కోసం మనం తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద లింగాపూర్ గ్రామ ప్రజాప్రతినిలు, మాజీ ప్రజాప్రతినిధులు కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.