✍️Ⓜ️🅰️K NEWS (గాలిపెల్లి)

ఎంపికైయిన విధ్యార్థులకు అభినందనల వెల్లువ
🔵కబడ్డీ అసోసియేషన్ 35 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని, ఫిజికల్ డైరెక్టర్ సాన బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర విభాగంలో 10 వ, తరగతి చదువుతున్న బుర్ర హర్షవర్ధన్, సుధగోని అఖిల్, చక్రాల వినయ్, బాలికల విభాగంలో కేశవేని అన్విత, ఎండ్ర సంజన ఎంపికైట్లు వెల్లడించారు. ఈ నెల 18 న, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరచి, ఈ నెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపిపారు. ఎంపికైయిన విద్యార్థులను అమ్మ ఆదర్శ కమిటి చైర్ పర్సన్ బట్టు పద్మ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, ఈ తరం యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవికారి నరేష్, ఎండ్ర సాయి గణేష్, సీనియర్ క్రీడాకారుడు కేశవేని శ్రీనివాస్, నాయకులు, గ్రామస్థులు అభినందించారు.
