
✍️Ⓜ️🅰️K NEWS (ఇల్లంతకుంట)
ఇల్లంతకుంట మండల కేంద్రంలో హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి నవరత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజువారీగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యేక అమ్మవారి అలంకరణ చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగసముద్రంలో బాలకృష్ణ, అర్చకుడు రాజేశ్వర్ శర్మ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.