–రూపాయలు 80 లక్షల గన్నిసంచుల మాయం గురించి చర్చకు వచ్చేనా
–సొసైటీలో వ్యవసాయ పనిముట్లు ,పరికరాలు ఇనుప సామాను తూకానికేనా..!
✍️Ⓜ️🅰️K NEWS

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఫ్యాక్స్) సాధారణ మహాసభ సమావేశం రేపు శనివారం జరగనుంది. చాలా రోజుల తర్వాత ఈ సమావేశం నిర్వహించడంతో ఉత్కంఠ నెలకొంది. ఓవైపు సొసైటీ చైర్మన్ కుర్చీ కోసం డైరెక్టర్ల కొట్లాట.. మరోవైపు ప్రభుత్వం ఊరించి.. ఊరించి.. కోసమేరుపుగా మళ్లీ పాతవారికి పగ్గాలు ఇస్తున్నట్టుగా ప్రకటించడం.. వీటితో పాటుగా.. సొసైటీలో సుమారు 80 లక్షల రూపాయల గన్ని సంచుల మాయంపై చర్చ అంశాలపై సమావేశం వాడి వేడిగా జరగనుంది. సొసైటీలో రూ. 80 లక్షల రూపాయల గన్నిసంచుల మాయాజాలం జరిగిందని స్వయంగా డైరెక్టర్ భర్త ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నారం నరసయ్య ఆధారాలతో సహా, బయట పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు గన్ని సంచుల మాయంతో పాటుగా, ప్రభుత్వం సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, ట్రాక్టర్లు అందివ్వాలని సంకల్పంతో మంజూరు చేసింది. రైతులకు కావలసిన సమయంలో ,ట్రాక్టర్ ,విత్తనాలు నాటే పరికరాలు, ఇతర పరికరాలు రోజువారిగా కూలి చెల్లించి, తీసుకు వెళ్లాల్సి ఉంది. కానీ సొసైటీ సభ్యులు తమకేమి పట్టనట్టుగా వీటన్నింటిని స్టోరేజ్ రూంలో చెత్తకుప్ప మాదిరిగా, వేసి ఇనుప సామానుకు తూకంలో వేసే విధంగా తయారు చేశారని సొసైటీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటుగా ఇప్పటివరకు సొసైటీకి యూరియా బస్తాల డీడీలు తీశామని చెప్తున్నా, కానీ ఇప్పటివరకు యూరియా బస్తాలు సొసైటీకి చేరుకోకపోవడంతో, పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏదేమైనా రేపు జరగబోయే సర్వసభ్య సాధారణ సమావేశం, అసాధారణంగా ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
