✍️Ⓜ️🅰️K NEWS (ఇల్లంతకుంట)

జిల్లా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వై శశికళ
అధికారులు ,ఉద్యోగులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, ఇల్లంతకుంట ఎంపీడీవో వై శశికళ సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మండలంలోని 199 పోలింగ్ ఆఫీసర్లకు, 78 మంది ఓపిఓలకు, మాస్టర్ ట్రైనర్ గుర్రం సందీప్ రెడ్డి నేతత్వంలో శుక్రవారం శిక్షణ అందించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థ ఎన్నికలలో అధికారులు, సిబ్బంది విధులు ,ఎలా నిర్వర్తించాలో పూర్తిస్థాయిలో వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద, బ్యాలెట్ పత్రాలు, బూతుల వద్ద అధికారులు ,పోలింగ్ సిబ్బంది తీసుకబోయే జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తాహాసీల్దార్ ఎంఏ ఫారుక్, ఎంపీఓ శ్రీనివాస్, అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.