✍️Ⓜ️🅰️K NEWS ,(నర్సక్క పేట)

ఇల్లంతకుంట మండలం నర్సాపేట గ్రామంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండప నిర్వహకులు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగ సముద్రాల బాలకృష్ణ, అర్చకులు రాజేశ్వర శర్మ, మామిడి సంజీవ్, చిట్టి ప్రదీప్ రెడ్డి, ఎర్రోజు సంతోష్, సన్నీ, పిల్లి సుధీర్, మామిడి శ్రీనివాస్, బండారు సాత్విక్, అంతటి శ్రీనివాస్, కొండ్ల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.