
-వెంకట్రావ్ పల్లే లో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ
✍️Ⓜ️🅰️K ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆది నుంచి గ్రామంలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం, గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని అన్ని గ్రామాలలో తొమ్మిది రోజులకు, బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా, వెంకట్రావు పల్లె గ్రామంలో ముందస్తుగానే ఏడు రోజులకు, సద్దుల బతుకమ్మను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు పాల్గొని బతుకమ్మ ఆటలను ఆడారు. అనంతరం తీరక్క పూలతో పేర్చిన బతుకమ్మను మహిళలు నెత్తి పైన ఎత్తుకొని, సమీపంలోని వాగులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.