
maknews (పెద్దలింగాపూర్)
-ఒక్కొక్కరికి రూ.8 వేలు అందజేత
అనాధ చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించి, ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొడిసెల జీతేందర్ గౌడ్ శభాష్ అనిపించుకున్నాడు. గ్రామానికి చెందిన 8 మంది అనాధ చిన్నారులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ,ఈ ఏడాది కూడా తల ఒక్కొక్కరికి రూ.8వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన కొలపురి పావని, శీలం వివేక్, బాలసాని చరణ్, నర్ర సహస్ర,శీలం సుమలత, శీలంమహేష్, వెగ్గళ్లం స్వాతి, వెగ్గళ్లంవెన్నెల, చిన్నారులకు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ,సమాజ సేవ చేయాలని దృఢ సంకల్పంతో చిన్నారులకు ఆర్థిక సహాయం అందించానని మాజీ సర్పంచ్ తెలిపారు.