maknews(పెద్దలింగాపూర్)

-గ్రూప్ 2 ఫలితాల్లో ఎంపీఓ గా పోస్ట్
గ్రూప్-2 ఫలితాల్లో మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)గా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన కరేదా నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎంపికయ్యాడు. గతంలో గ్రూప్- 4 రాయగా కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు, అదేవిధంగా గ్రూప్ -3రాసీ ర్యాంక్ సాధించాడు,త్వరలోనే ఉద్యోగం రానున్న నేపధ్యంలో, తాజాగా గ్రూప్ -2లో విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీఓగా ఎంపికయ్యాడు. నిఖిల్ రెడ్డి తండ్రి కరేద రాజీరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి జయ గృహిణీ. ఎంపిఓ గా ఎంపిఓ గా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.