
maknews(పొత్తూరు) ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో పత్తి తూకంలో “ఘరానా” మోసం బయట పడింది. గ్రామాల్లో గత రెండు, మూడు రోజులుగా టాటా ఏసీ వాహనంలో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తున్న ఓ పత్తి మిల్లు నిర్వాహకుడు రైతులను నిండా ముంచాడు. రైతులు తెలుసుకొని చాఖ చక్యంగా ఆ ఘరానా మోసగాడిని తో పాటుగా, తనతో వచ్చిన వారిని, టాటా ఏసీ వాహనాన్ని రెడ్ హ్యాండెడ్ గా, పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. గత మూడు రోజులుగా పొత్తూరు గ్రామంలో పత్తిని కొనుగోలు చేస్తూ నిర్వాహకుడు, పత్తి తూకంలో చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. దీంతో రైతులకు అనుమానం రావడంతో, నిన్న రాత్రి రైతులు పత్తిని తమ దగ్గర ఉన్న తూకం కాంటాలో వేసి వెయిట్ తెలుసుకున్నారు. తెల్లవారుజామున వచ్చిన పత్తి కొనుగోలు వ్యక్తికి పత్తిని విక్రయించారు. ఒక్కసారిగా మూడు కుంటలో ఉన్న పత్తి రెండు క్వింటలుగా రావడంతో, నిలదీశారు. పత్తి కొనుగోలు దారుడు వెంటనే చెమటలు కక్కి తూకం మిషన్ సరిగ్గా పని చేయడం లేదు బుకాయించాడు. రెండు రోజులుగా పత్తి కొనుగోలుదారుడు రైతులను నిండా ముంచాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని, మోసపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని పొత్తూరు గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.