
సంక్షేమం కోసం వెయ్యి కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ,పాలకవర్గాన్ని నియమించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో హలో రెడ్డి- చలో హైదరాబాద్ పోస్టర్ ను మండల అధ్యక్షుడు ఉమ్మంతల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, రైతు బీమాను కొనసాగించాలని, అదేవిధంగా రెడ్డి హాస్టల్ కోసం బుద్వేల్ లో కేటాయించిన 15 ఎకరాల భూమిని రెడ్డిలకు అందివ్వాలని, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్ని విభాగాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 8వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ సమీపంలో ధర్నా చౌక్ వద్ద రెడ్ల నిరసన కార్యక్రమం నిర్వహించ బడుతుందని, పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు తరలిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖిస కేశవరెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి నవీన్ రెడ్డి, చల్ల నవీన్ రెడ్డి, తుంకుంట రాజేందర్ రెడ్డి, చిలువేరు సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గుర్రం తిరుపతిరెడ్డి, పాట మీది శ్రీనివాస్ రెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి, తాటిపల్లి మహేష్ రెడ్డి, కేతిరెడ్డి నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.