
MAKNEWS తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణుల దాడి నిరసిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను బిజెపి శ్రేణులు దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు బిజెపి నాయకుల మధ్య తోపులాట నెలకొంది. ఒక్కసారిగా దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. బిజెపి శ్రేణులను పోలీసులు తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడి హరీష్, మాజీ మండల శాఖ అధ్యక్షుడు నాగసముద్రల సంతోష్, మానకొండూర్ కో కన్వీనర్ బత్తిని స్వామి, మండల ప్రధాన కార్యదర్శి కరిక నవీన్, తదితరులు పాల్గొన్నారు.