
MAK NEWS (కందికట్కూర్) కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్ గ్రామంలో వెలుగుచూసింది. మార్కెట్ ధర కంటే క్వింటాల్‌కు రూ.400 ఎక్కువ చెల్లిస్తామంటూ రైతులను ఆకర్షించి, డిజిటల్ వెయింగ్ మిషన్ ద్వారా తూకంలో భారీగా మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని గ్రామ రైతులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే.. పత్తి కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ ధర కంటే క్వింటాల్‌కు రూ.400 అదనంగా ఇస్తామంటూ కొందరు వ్యాపారులు రైతులను ఆకర్షిస్తున్నారు.
ఒక్క పత్తి మూటకు 40 కిలోల నుంచి 50 కిలోల వరకు తూకంలో మోసం చేస్తూ అడ్డంగా దోరికిపోయారు. గ్రామానికి చెందిన కంకణాల పర్శరాం అనే రైతు మూడు మూటల పత్తి తూకం వేయించాడు. మొదట ఒక్కోబస్తా క్వీంటాల్ వచ్చింది, తిరిగి రైతుకు అనుమానం వచ్చి మళ్లి తూకం వేయించడంతో ఒక్కో మూట క్వీంటాల్ 50కిలోలు వచ్చింది. దీంతో ఒక్కో మూటలో 50కేజీల మోసం తెలడంతో పోలీసులకు సమాచారం అందించారు. మోసనికి పాల్పడ్డ ముగ్గురు రైతు కుటుంబ సభ్యులను, గ్రామస్థులను ప్రాదేయపడడంతో వదిలిపెట్టారు.
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే వ్యాపారుల తూకాలపై సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తూకంలో మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.