
ఉత్కంఠ రేపుతున్న ‘విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం’ మండల ఎన్నికలు!
🟢స్థానిక పోరును తలపిస్తున్న ఎన్నికల ప్రచారం
🟣అధ్యక్ష పదవి కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ వార్
🟢కీలకంగా మారనున్న స్వర్ణకారుల ఓట్లు
🔵నేటి రాత్రితో ముగియనున్న ప్రచార పర్వం
🟣రేపే పోలింగ్.. లెక్కింపు
ఇల్లంతకుంట(MAKNEWS)
మండల విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం మండల ఎన్నికల వేడి ,తీవ్రస్థాయికి చేరింది. సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా ప్రచారం హోరాహోరీగా సాగుతుండటంతో మండల వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రచారంలో జోరు.. హామీల హోరు!
సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓటర్ల కోసం ప్రత్యేకంగా ధావత్లు ఏర్పాటు చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో సంఘం బలోపేతానికి, ఆలయ అభివృద్ధికి భారీ హామీలు గుప్పిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు
1) తిప్పారపు సంతోష్ 2)దేశరాజ్ తిరుపతిల మధ్య ప్రచార యుద్ధం కొనసాగుతుండటంతో ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కాగా, ఈ ఎన్నికల్లో స్వర్ణకారుల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. స్వర్ణకారుల మద్దతు ఏ అభ్యర్థికి దక్కితే వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాజ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
లోకల్ ..నాన్ లోకల్ వార్ కూడా వినిపిస్తుంది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నాన్ లోకల్ ఓటర్లు కూడా, గెలుపును ప్రభావితం చేస్తారని ఓవర్గం వారు గెలుపుపై నమ్మకం తో ఉన్నారు.
నేటి రాత్రితో ముగియనున్న ప్రచారం
గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల జోరుగా సాగిన ప్రచార పర్వం నేటి రాత్రితో ముగియనుంది. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఇల్లంతకుంట ఆలయంలో పోలింగ్
ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రేపు (ఆదివారం, 01-11-2026) అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- పోలింగ్ కేంద్రం: ఇల్లంతకుంట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం
- పోలింగ్ సమయం: ఆదివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు
- ఓట్ల లెక్కింపు & ఫలితాలు: అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
మండల విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే!