
మ్యాక్ న్యూస్
ఇల్లంతకుంట పట్టణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మనిమయ సంఘం అధ్యక్షునిగా తిప్పారపు శ్రావణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ మనమయ సంఘ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షునిగా శ్రావణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ మండల అధ్యక్షులు తిప్పారపు సంతోష్ కుమార్, తిప్పారపు సురేష్, తిప్పారపు రమేష్, తిప్పారపు వంశీ, తిప్పారపు సతీష్, తో పాటుగా సంఘ సభ్యులు పాల్గొని నూతన అధ్యక్షున్ని అభినందించారు.