
MAK NEWS ఎంతో ప్రసిద్ధిగాంచిన ఇల్లంతకుంట మండలం రామోజీపేటలోని శ్రీ సీతారాముల ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు (విహేచ్) శనివారం దర్శించుకున్నారు.ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై, మొదటిసారిగా శ్రీ సీతారాముల ఆలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా తన కుటుంబ సభ్యులతో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముందుగా వచ్చి, కళ్యాణం తో పాటుగా, స్వామివారికి పట్టు వస్త్రాలను అందిస్తూ వస్తున్నారు. శ్రీ సీతారాముల స్వామి దీవెనలతోనే, మరోసారి తనకు పదవి వచ్చిందని, రాష్ట్ర ప్రజలందరూ, సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థించి నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజు, పసుల వెంకటి, తో పాటుగా అర్చకులు సీతారామ శర్మ, తదితరులు పాల్గొన్నారు.