
MAKNEWS
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలని, అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మచ్చ గీత అన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కందికట్కూర్, వంతడుపుల, ముస్కాన్ పేట వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు వేగవంతంగా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతుల ను రైతుల కు కల్పించాలన్నారు. వెంట వెంటనే ఆన్ లైన్ నమోదు చేస్తూ, డబ్బులు పొందేలా చూడాలన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో వివో ఏలు, మరియు వివో అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొదుపులు పెంచుకోవడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి తగిన ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను సద్వి నియోగం చేసు కోవాలన్నారు.మహిళా సభ్యులు ఏర్పాటు చేసుకున్న మినరల్ వాటర్ ప్లాంట్, చెప్పుల దుకాణం, లేడీస్ ఎంపోరియం లాంటి ఎంటర్ప్రైజెస్ లను ఆవేశ స్వయంగా పరిశీలించారు. సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వై శశికళ, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య రెడ్డి, కార్యదర్శి అంతగిరి సరస్వతి, సీసీలు రామచంద్రారెడ్డి, వెంకటేశం, రామచంద్రం, విట్టల్ రెడ్డి, రాజేశ్వరి, వివో ఏలు కమిటీ సభ్యులు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.