
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ సర్పంచ్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అరుకాల నవీన్ కుమార్ డ్రైనేజీ వ్యవస్థ పై ప్రక్షాళన మొదలుపెట్టాడు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాడు. ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా మొదటగా డ్రైనేజీ వ్యవస్థ పై ప్రక్షాళన మొదలుపెట్టాడు. జెసిబి సహాయంతో, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి, స్వయంగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించే కార్యక్రమం చేపట్టాడు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తానని, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలంన్నిటిని కూడా నెరవేస్తానని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిప్పరవేణి కిషన్, తో పాటుగా గ్రామస్తులు పాల్గొన్నారు.