
గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత మరియు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఆద్దాలు , ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు గోడలపై బలవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ జడ్పీవైస్ చైర్మన్ సిద్దం వేణు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం, అసహనం, రాజకీయ దివాళాను స్పష్టంగా చూపిస్తందన్నారు.ఖ్యాతన పల్లి , ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో BRS విజయాన్ని, జీర్ణించుకోలేక ఈ రకమైన నీచ రాజకీయాలకు దిగడం అత్యంత ఖండనీయమన్నారు.
రేవంత్ రెడ్డి ఆయన ఫోటోను బలవంతంగా ప్రతి గోడపై పెట్టేంత గొప్ప వ్యక్తిత్వమా అని ప్రశ్నించారు.
ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రభుత్వ నివాసాల్లో నరేంద్ర మోదీ ఫోటోలు పెట్టినారా అని ప్రశ్నించారు.క్యాంప్ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల నివాసాలే తప్ప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాల్సిన ఎలాంటి నిబంధన లేదన్నారు.ఎంఐఎం,బీజేపి మరియు కేంద్ర మంత్రులకు కేటాయించిన కార్యాలలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారా అన్నారు.ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన రాజకీయ దౌర్జన్యం. ఇలాంటి దుండగ చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.