
mak news (కందికట్కూర్)
వేసవి కాలంలో ఎండ తీవ్రత నేపధ్యంలో ఉపాధి హామీ కూలిలకు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని డిఆర్ డిఓ మచ్చ గీత తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని కందికట్కూర్ గ్రామంలో జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను ఆమే పరిశీలించారు. పని వద్ద ఉపాధి హామీ కూలీలకు అందిస్తున్న సౌకర్యాలు నీరు, నీడ, ప్రథమ చికిత్స పెట్టె , ఓఆర్ఎస్ ప్యాకెట్స్ గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిది కూలీలకు తప్పనిసరిగా అందివ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి ఎండలు ఎక్కువ ఉన్న దృష్ట్యా కూలీలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకునే విధంగా ఉదయం 6 గంటలకే పనులకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికల, ఏపీఓ పులి చంద్రయ్య, ఏపిఎం కుమార్, ఉప సర్పంచ్ దొమ్మాటి అజయ్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఐకేపి సీసీ లు రాంచంద్రారెడ్డి, రాజేశ్వరి, వార్డు సభ్యులు దొమ్మాట శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత,ఆశా కార్యకర్తలు, మేట్ లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.