
maknews / -ఉపాధ్యాయుడు వుడుత మహేష్ చంద్రకు అభినందన వెల్లువ
-*మొదటి సారిగా మండలానికి దక్కిన అరుదైన గౌరవం*
ఫిన్లాండ్ దేశంలోని ప్రపంచస్థాయి బోధన వ్యవస్థ అధ్యయనం కోసం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హై స్కూల్లో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఉడుత మహేష్ చంద్ర ఎక్స్పోజర్ విజీట్ విజయవంతంగా ముగిసింది. ఐదు రోజుల పాటు అంతర్జాతీయ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల ఎక్స్పోజర్ ఫిన్లాండ్ దేశంలో నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం నుండి ఉపాధ్యాయుడు మహేష్ చంద్రకు ఈ అవకాశం దక్కడంతో మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిసా (PISA)సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన ఫిన్ లాండ్ బోధన వ్యవస్థ విధి విధానాలను, శిక్షణ పద్ధతులను, పాఠశాల వ్యవస్థ అధ్యయనం చేసేందుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్సింకి లోని ప్రముఖ పాఠశాల, యూనివర్సిటీలను, ఒకేషనల్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లను, ప్రొఫెసర్లతో బోధన పరమైన అంశాలను, క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఈ పర్యటన దోహద పడిందన్నారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ బోధన, క్రీడలపై ప్రత్యేక దృష్టి, సమానత్వ బోధన, ప్రైవేటు పాఠశాలలో కాకుండా, ప్రభుత్వ పాఠశాలల పైన కేంద్రీకృతం కావడం, మొదలగు అంశాలను చర్చించినట్టు పేర్కొన్నారు. మొత్తం ఫిన్ లాండ్ పర్యటనలో ఐదు రోజులపాటు చర్చించిన, నేర్చుకున్న, పరిశీలించిన అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఉపాధ్యాయుడు మహేష్ చంద్ర వివరించారు. వీరితో పాటుగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్యదర్శి సిక్తా పట్నాయక్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, సి ఈ ఆర్ టి డైరెక్టర్ గాజర్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.