
MAKNEWS/ఇల్లంతకుంట
మండలం లోని వల్లంపట్ల గ్రామంలో కూరగాయల అంగడి, తో పాటుగా, మంచినీటి వాటర్ ప్లాంట్ నిర్వాహన కోసం వేలంపాట నిర్వహిస్తున్నట్లు, సర్పంచ్ నేరెళ్ల విజయ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాటలో పాల్గొని వారు గ్రామపంచాయతీ కార్యదర్శి తో సంప్రదించాలని సూచించారు. 2026-27 సంవత్సరానికి గాను కూరగాయల అంగడికి రూపాయలు 33,000, వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కు రూపాయలు 38,500 మద్దతు ధర నిర్వహించడం జరిగినది ఆయన తెలిపారు. 30వ తేదీ గురువారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.