
MAKNES బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘీఖ సంక్షేమ బాలికల పాఠశాల కు చెందిన విద్యార్థినిలు సత్తా చాటారు. సోషల్ వేల్ఫేర్ స్కూల్లో పదవ తరగతి పరీక్షల్లో మందాటి హనీ 586 మార్కులు సాధించి టాపర్ గా నిలువగా, బాలసాని రుచిత 580 మార్కులతో రెండవ స్థానంలో నిలిచి బాలికలదే ఫై చేయ ని నిరూపించారు.. ఉత్తమ మార్కులు కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణీ , ఉపాధ్యాయినీలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.