
maknews
చిన్ననాటి స్నేహితుడి ఆకాల మృతి… ఆ స్నేహితుల ను కలచివేసింది… స్నేహితులంతా.. ఒక్కటై… ఒక్కొక్కరు తోచిన సహాయం చేకూర్చి.. నిరుపేద కుటుంబానికి చెందిన మృతుని కుటుంబానికి రూ. 66 వేల ఆర్థిక సాయం అందించి, గొప్ప మనసు చాటుకున్నారు తోటి స్నేహితులంతా.. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని “గీతా విద్యాలయం పాఠశాల” కు చెందిన ‘దాసరి నాగరాజు’ అనే స్నేహితుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేక మృతి చెందాడు. వారి కుటుంబ దీన స్థితిని చూసిన 2002-2005 కు చెందిన గీతా విద్యాలయం పాఠశాల పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరు, చేయి చేయి కలిపి ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో, మొత్తం రూ. 66 వేల ఆర్థిక సహాయాన్ని నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. 50వేల రూపాయలు నాగరాజు కుమార్తె పేరున ఫిక్స్ డిపాజిట్ చేయగా, 16 నగదును నాగరాజు భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతా విద్యాలయం పాఠశాల ఉపాధ్యాయులు సానబాబు, తుంకుంట రామలింగారెడ్డి, పొన్నాల రాజు, కంకణాల శ్రీనివాస్, గుర్రం సందీప్ రెడ్డి, బాలకిషన్, లక్ష్మణ్, పాటుగా పూర్వ విద్యార్థులు ఒగ్గు రంజిత్, ఎండి రియాజ్, మహేష్, సజ్జన్, ఎండి సాదుల్, సావనపెల్లి అనిల్ కుమార్, సునీల్, సంతోష్, చేరాల రాజు, తో పాటుగా విద్యార్థి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.