
MAKNEWS
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో పంచర్ షాప్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కులకు చిహ్నమైన ఎర్రజెండాను పంచర్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు సొల్లు లక్ష్మణ్ ఆవిష్కరించారు. ప్రతి కార్మికుడికి మే డే శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఎండి జమాల్, తిప్పారపు రమేష్, ఎల్లయ్య, కుంభం శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.