
MAK NEWS ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల పుష్పలత గౌడ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన తీగల పుష్పలత గౌడ్ మాజీ ఎంపీటీసీ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పుష్పలత గౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణకు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ప్రభుత్వ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పార్టీ మండల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పార్టీ కోసం కృషి చేస్తానని, అదేవిధంగా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.