
MAK NEWS
-వంతడుపుల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో
-ఇల్లంతకుంట చౌరస్తా వద్దకు రైతుల భారీ ర్యాలీ
-రోడ్డుపై వంటావార్పుతో నిరసన
-మార్క్ఫెడ్ డిఎం హామీతో రైతులు ఆందోళన విరమణ
మన తెలంగాణ/ఇల్లంతకుంట
ఆరుకాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయాలని వంతడుపుల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి రాస్తారోకో చేపట్టిన కూడా ప్రభుత్వం నుంచి గాని ,అధికారుల నుంచి గాని ఇలాంటి హామీ రాకపోవడంతో, ఇల్లంతకుంట మండల కేంద్రం వద్దకు పాదయాత్రగా రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో ని వివేకానంద విగ్రహం వద్దకు రైతులు ర్యాలీగా చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు వినూత్న రీతిలో వంటావార్పు రోడ్డుపైనే చేసి నిరసన తెలిపారు.
ఎండలో సైతం రైతులు ఆందోళన…
తీవ్రమైన ఎండలో సైతం రైతులు..మహిళా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గంటల తరబడి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివేకనంద స్టాచ్యూ వద్ద వారు ఆందోళన చేపట్టారు. చివరకు ఆందోళన చూసిన పలు గ్రామాల రైతులు తాత్కాలికంగా గ్రీన్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు.
రోడ్డుపై బైఠాయించి గంటల తరబడి నిరసన …. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లి పత్తికుంట పల్లె, తాళ్లపెల్లి, గాలి పెల్లి, ముస్కాన్ పేట, తో పాటుగా పలు గ్రామాల రైతులు పొద్దుతిరుగు పంటను కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బలగాలను మొహరించాయి. జిల్లా నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలగాలు ఇల్లంతకుంటకు చేరుకొని బందో బస్త్ నిర్వహించారు.
మార్క్ ఫేడ్ డిఎం హామీతో ఆందోళన విరమణ
పొద్దుతిరుగుడు మార్క్ఫెడ్ డిఎం హామీతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న రైతులు రాస్తారోకోను తాత్కలికంగా విరమించారు.. మార్కెట్ డిఎం మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించామని, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చిన తర్వావత కొనుగోలు చేస్తామని అంతవరకు రైతులు ఎవరు కూడా అదే పడవద్దని.. ఆందోళనకు దిగువద్దని ఆయన పేర్కొన్నారు. దీంతో రైతులు కొంత సమయం పాటించి మూడు రోజులపాటు వారి యొక్క ఆందోళనను విరమిస్తున్నట్టుగా తెలిపారు.
ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం…
ప్రభుత్వం ప్రొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని… అక్కడికి కూడా వెళ్ళనీయకుండా పోలీసులను పెట్టి అడ్డుకుంటే మేము పండించిన వేల క్వీంటాల్ల ధాన్యాన్ని రోడ్డుపైనే పోసి మా యొక్క నిరసనను తెలుపుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో పలు గ్రామాల కుఃచెందిన రైతులు 200 మంది పాల్గొన్నారు.