
MAK NEWS
రక్తసంబంధంతో పుట్టిన అన్న చనిపోయాడని మరణ వార్త విని… తన చివరి చూపుకు వెళ్లిన… తోబుట్టువు.. గుండెపోటుతో మృతి చెందిన సంఘటన.. పెద్ద లింగాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన గొప్ప బాలయ్య (75)అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మరణ వార్తను కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో పాటుగా, తాళ్లపల్లి గ్రామంలో ఉన్న.. మృతుడి తో బుట్టువు కనుకవ్వ (65) కు చేరవేశారు. వెంటనే కనుకవ్వ తన కుటుంబ సభ్యులతో పెద్ద లింగాపూర్ గ్రామానికి చేరుకుంది. అన్న మృతదేహంపై రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. అన్న చెల్లెల అనుబంధం.. ఈ యొక్క సంఘటనతో… అర్థమవుతోంది. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.