
MAK NEWS వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఇల్లంతకుంట మండలం అనంతారం-ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై రైతులు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతులు పండించిన వడ్ల బస్తాలతో రోడ్డుపై రైతులు నిరసన తెలుపడంతో.. వాహనదారుల కు ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భంగా రైతుల మాట్లాడుతూ లారీల కొరత వల్ల.. వడ్లు తూకం వేయడానికి ఇబ్బంది కలుగుతుందన్నారు. ట్రాక్టర్ ద్వారా ధాన్యం బస్తాలు తరలిస్తే.. రైస్ మిల్ల వద్ద నాలుగు రోజుల పాటు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియన వేగం వంత చేయాలని వేడుకున్నారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, తన సిబ్బందితో కలిసి రైలు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు.