
MAKNEWS
ఆన్ లైన్ లో మెడికల్ షాప్ లకు సంబంధించిన మందులను, ఔషధాలను విక్రయించడానికి నిరసిస్తూ.. ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటుగా, పలు గ్రామాలలో స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసివేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు సామ జలపతి రెడ్డి ఆధ్వర్యంలో, మెడికల్ షాప్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలపతి రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ అమ్మకాల్లో చాలా వరకు మోసాలు ఉన్నాయని. నాణ్యమైన మందులు విక్రయించకుండా, నకిలీ మందులు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిత్యం ప్రజలకు 24 గంటల సేవలు అందించే మెడికల్ షాప్ నిర్వాహకులపై, ఆన్ లైన్ కార్పొరేట్ వ్యవస్థ గుది బండను విధిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మొత్తం మండలంలో 28మెడికల్ షాపులు మూసివేశారు.ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ నిర్వాహకులు కాసారపు హరీష్, ఏనుగు నవీన్, దుద్దెడ రాజు, భూంపెల్లి రవీందర్ రెడ్డి, రెడ్డి మహేందర్ రెడ్డి, దాసరి ప్రశాంత్, సామ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.