
MAK NEWS
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు, ఏపీకే లింక్, ఇతర నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల స్పందించ వద్ద ని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కుమార్ సూచించారు. మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో గ్రామస్తులకు సైబర్ నేరాలపై…”సురక్షక తిరంగా-సైబర్ స్వతంత్ర తెలంగాణ” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారని, లింకుల ద్వారా, ఓటిపిల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని, వారిపట్ల అప్రవతలతో ఉండాలని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వారు ఫోన్ చేసి డబ్బులు పంపి వాళ్లని చెబితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సైబర్ మోసానికి గురైనట్లు తెలిస్తే వెంటనే మొదటగా 1930 సైబర్ హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్పతి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.