
MAKNEWS : పలు అభివృద్ది పనులను ప్రారంభించాడానికి పిసిసి ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ వల్లంపట్ల కు విచ్చేస్తున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన ఆహ్వావ ఫ్లేక్సీలు మాయమయ్యాయి. వల్లంపట్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎలుక అనిల్ రెండు భారీ ఫ్లేక్సీలను అర్ధరాత్రి వల్లంపట్ల గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేశాడు. దీంతో ఎవరో గుర్తు తేలియని వ్యక్తులు రెండు ఫేక్సీలను ఎత్తుకేళ్లారు. ఉదయం ఫేక్సీలు కనపడకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్నారు. పార్టీ నాయకత్వానికి తెలిపారు.