
MAKNEWS (9490548827) అసెంబ్లీ ఎదుట బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై, ఎమ్మెల్సీలలపై ప్రభుత్వం పోలీసులను పెట్టి దాడి చేయించారని.. దీనికి నిరసనగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కు నిప్పంటించగా, పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు దిష్టిబొమ్మపై నీళ్లను తీసుకొచ్చి పోసి చల్లార్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.