
✍️Ⓜ️🅰️K NEWS (నర్సక్కపేట)
ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద శుక్రవారం 108 రకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు ఈ రోజు లలిత దేవి అలంకరణలో దర్శనమిచ్చినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు మండప వద్ద చేరుకొని 108 రకాల నైవేద్యాలను తీసుకువచ్చి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సక్కపేట గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.